ETV Bharat / jagte-raho

అదనపు కట్నం కోసం వేధింపులు... ఆదుకోవాలని బాధితురాలు వినతి

తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులలో ఓ మహిళ అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. అదనపు కట్నం కోసం తనను వేధింపులకు గురి చేస్తూ... ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.

dowry harassment
ఆదుకోవాలని బాధితురాలు వినతి
author img

By

Published : Jul 16, 2020, 11:43 PM IST

తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన పుల్ల సుధకు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన మిడిదొడ్డి వినోద్‌తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో తమ తాహతుకు తగ్గట్లు కట్న కానుకలు ఇచ్చినా... పెళ్లయిన ఆరు నెలల నుంచి అదనపు కట్నం తేవాలంటూ తనని వేధిస్తున్నట్లు సుధ చెబుతోంది. అంతే కాకుండా అదనపు కట్నం తీసుకొస్తేనే ఇంట్లో అడుగుపెట్టాలని అత్తింటి వారు తనని పుట్టింటికి పంపించినట్లు వివరించింది.

ఈ విషయంపై పలుమార్లు పంచాయతీలు పెట్టించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని సుధ ఆవేదన వ్యక్తం చేసింది. తను ఉండగానే ఏడాది క్రితం వినోద్‌ మరో మహిళను వివాహం చేసుకున్నట్లు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ ప్రస్తుతం వినోద్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడే వంటావార్పు చేసుకుంటూ ఉంటానంటోంది.

ఇవీ చూడండి:

జిల్లాలో భారీ వర్షాలు.. మునిగిన వరినాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.