తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుబీర్ మండలం గొడిసెరాలో వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గొడిసెరా గ్రామానికి చెందిన అఖిల్ బేగ్కు, కామారెడ్డి జిల్లా ఏన్బోరా గ్రామానికి చెందిన నజిమతో 4సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి సంవత్సరం క్రితం ఇద్దరు ఆడ కవలలు జన్మించారు. పెళ్లి అయినప్పటి నుంచి అత్తింటివారు వరకట్నం విషయంలో వేధిస్తూ ఉండేవారని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
2 నెలల కిందట వరకట్నం విషయంలో గొడవపడి నజిమ తమ ఇంటికి వచ్చిందని అన్నారు. అప్పుడు నచ్చచెప్పి పంపించమని కుటుంబసభ్యులు తెలిపారు. ఆడపిల్లలు జన్మించినప్పటి నుంచి వేధింపులు ఇంకా పెరిగిపోయాయని చెప్పారు. అత్తింటివారే హత్యచేసి... ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. వరకట్నం విషయమై వారి మధ్య గతంలో రెండు మూడు సార్లు గొడవలు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: