చిత్తూరు జిల్లా యాదమరి మండలం డి.కె. చెరువు సమీపంలో అటవీ సిబ్బందిపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో అటవీశాఖ ఉద్యోగి సతీష్ మృతి చెందాడు. చిత్తూరు పశ్చిమ అటవీ రేంజ్ పరిధిలోని డి.కె పురం బీట్‌లో విధులు నిర్వహించేందుకు బీట్ అధికారి హరి, డ్రైవర్ సతీష్ విధులు ముగించుకొని వస్తుండగా.. మార్గమధ్యమంలో జీపును ఏనుగు అడ్డగించింది. ఒక్కసారిగా ఆందోళనకు గురైన ఇద్దరూ... జీపును అక్కడే వదిలేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
వారిద్దరిని వెంటాడిన ఏనుగు... తొలుత డ్రైవర్ సతీష్ పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సతీష్ ఘటనా స్థలంలోనే ప్రాణాలను వదిలారు. వేగంగా పరిగెత్తిన బీట్ అధికారి హరి... ఏనుగు బారి నుంచి తప్పించుకోగలిగారు. సతీష్‌పై దాడి చేసిన ఏనుగు... కొంతసేపటి తరువాత అదే మార్గం గుండా వెళ్తున్న ద్విచక్రవాహనదారులపై దాడికి యత్నించింది.
![elephant attacked on forest department staff in chittoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9178360_789_9178360_1602699206925.png)
కుటుంబసభ్యులకు సమాచారం...
డ్రైవర్ సతీష్‌పై ఏనుగు దాడి సమాచారాన్ని అందుకున్న చిత్తూరు పశ్చిమ రేంజ్ అధికారి సుభాష్, డిప్యూటీ రెంజ్ అధికారి శివరాం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సతీష్ మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
ఇదీ చదవండి: