ETV Bharat / jagte-raho

మైనర్​తో అసభ్య ప్రవర్తన.. వాలంటీర్​పై పోక్సో కేసు - prakasam district suravarapupalle village volunteer news update

ప్రకాశం జిల్లా యద్ధనపూడి మండలం సురవరపుపల్లె గ్రామ వాలంటీర్​పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో మైనర్​తో అసభ్యకరంగా ప్రవర్తించి, ఆమె తల్లిపై దాడికి పాల్పడినందుకుగాను బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

volunteer behaved rudely with a minor
మైనర్​తో అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్​పై కేసు నమోదు
author img

By

Published : Nov 25, 2020, 12:07 PM IST

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన యద్ధనపూడి మండలం సురవరపుపల్లె గ్రామంలో జరిగింది. వాలంటీర్​గా పని చేస్తున్న ఏ. రాజేష్.. మద్యం సేవించి రాత్రి 9 గంటలకు ఓ ఇంటి వద్దకు వెళ్లాడు. పొలం పాస్ బుక్, ఆధార్ కార్డు కావాలని అడిగాడు.

ఈ క్రమంలో ఇంటి యజమాని భార్య వాటిని తెచ్చేందుకు లోపలికి వెళ్లగా.. అక్కడే ఉన్న కుమార్తెతో వాలంటీర్​ అసభ్యంగా ప్రవరించాడు. బాలిక కేకలు వేయటంతో.. ఆమె తల్లి అక్కడకు వచ్చి అడ్డుకోగా ఆమెపైనా దాడికి దిగాడు. బాధితురాలు మైనర్ అయినందున ఆమె ఫిర్యాదుపై పోలీసులు పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి:

పర్చూరులో కొనుగోలు కేంద్రం కోసం మిర్చి రైతుల ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.