తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి శివారులో విషాదం జరిగింది. వివాహేతర సంబంధం బయటపడిన కారణంగా.. అవమాన భారాన్ని తట్టుకోలేక ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడారు. వారి కుటుంబాల్లో విషాదం నింపారు.
మాచిరెడ్డికి చెందిన నర్సింహులుకు గతంలోనే పెళ్లి అయ్యింది. ఇద్దరు కుమారులూ ఉన్నారు. మరో మహిళకు భర్త, కుమారుడు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఇరు కుటుంబాల్లో విషయం తెలిసిపోయిందనే అనుమానంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెట్టుకు ఉరి వేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: