నెల్లూరు జిల్లా అల్లూరులో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర స్థాయిలో చెలరేగింది. ఆస్తి, వ్యక్తిగత తగాదాల కారణంగా బంధువుల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
12 మందికి గాయాలు..
ఒక వర్గంలో ఏడుగురు, మరో వర్గంలోని ఐదుగురు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులకు వెంటనే అల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించారు. కొందరిని నెల్లూరు వైద్యశాలకు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు.
ఇవీ చూడండి : తెలంగాణ : మట్టపల్లి శివాలయంలోనికి పులిచింతల బ్యాక్ వాటర్