చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని గుండ్ల గుట్టపల్లి వద్ద కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా... ఒకరికి గాయాలయ్యాయి. మృతులంతా చెన్నైకు చెందిన వేలు (27), మణిబాలన్ (25), వేణుగోపాల్ (60)గా గుర్తించారు. చెన్నై పెరియకోయిల్ బాకం నుంచి తెలంగాణలోని సిద్దిపేట మల్లన్నసాగర్కి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారులో తమిళనాడు నుంచి తెలంగాణ వెళ్లేందుకు అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకుని పాకాల పోలీసులు కేసు నమోదు చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇవీ చదవండి...