ETV Bharat / jagte-raho

నా వల్లే చనిపోయాడు.. నేనూ ఉండలేను! - mahabubnagar district news today

చదువుకోవడానికి కాలేజీకి వెళ్తలేవనీ, నీకు తిండి ఎందుకని తల్లి మందలించింది. తెలిసీ తెలియని వయసులో ఆవేశానికి గురైన కొడుకు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు భవిష్యత్తు బాగుండాలని చెబితే ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేక కన్నతల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరులో జరిగింది.

తెలంగాణలో విషాదం.. తల్లీ కొడుకు ఆత్మహత్య

author img

By

Published : Feb 3, 2020, 9:52 AM IST

తెలంగాణలో విషాదం.. తల్లీ కొడుకు ఆత్మహత్య

నీకు తిండి దండగని తల్లి మందలించింది.. అంతే మనస్థాపం చెందిన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. అది చూసి తట్టుకోలేక తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన చిట్టెమ్మ భర్త చనిపోయాక తన ఇద్దరు కుమారులను కష్టపడి పోషిస్తుంది. చిన్న కుమారుడు శ్రీరామ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా కొడుకు కళాశాలకు వెళ్లడం లేదని తల్లి చిట్టెమ్మ మందలించింది.

అయినా వినక పోవడం వల్ల నీకు తిండి దండగా అని కొడుకును దారిలోకి తెచ్చేందుకు వంట చేయకుండా ఉంది. మనస్థాపానికి గురైన కొడుకు శ్రీరామ్ క్రిమిసంహారక మందు తాగి తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మాటల వల్లే కొడుకు మృతి చెందాడని మనస్తాపం చెందిన తల్లి కూడా క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పెద్ద కుమారుడు సిద్దార్థ మహబూబ్​గర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఇంట్లో తల్లి కొడుకు ఆత్మహత్యలతో కొల్లూరు గ్రామంలో విషాదం అలుముకుంది.

ఇదీ చూడండి : ప్రపంచంపై ఒకవైపు కరోనా.. మరోవైపు మిడతల దండయాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.