ETV Bharat / jagte-raho

తండ్రి చనిపోతే వచ్చాడు.. కన్న తల్లిని నరికి చంపాడు - సంగారెడ్డి జిల్లా నేర వార్తలు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా షేర్‌ఖాన్‌ పల్లిలో దారుణం జరిగింది. తనకు ఆస్తి తక్కువ పంచారనే కోపంతో కన్న తల్లినే గొడ్డలితో నరికి చంపాడో ఓ వ్యక్తి. తండ్రి మరణం వార్త విని ఇంటికి వచ్చిన ఆ చిన్న కుమారుడు ఆస్తి కోసం తగాదా పెట్టుకున్నాడు. ఆస్తి తక్కువ ఇచ్చినందుకు తల్లిని చంపుతానని అక్కడే శపథం చేశాడు. చెప్పినట్లుగానే కన్నతల్లిని అంతమొందించాడు.

తండ్రి చనిపోతే వచ్చాడు.. కన్న తల్లిని నరికి చంపాడు

author img

By

Published : Sep 23, 2020, 11:59 PM IST

సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్‌ఖాన్ పల్లిలో కోటగాళ్ల సాయిలుకు నలుగురు కుమారులు. నర్సింహ అనే చిన్న కుమారుడు సొంత గ్రామంలో కాకుండా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు.

గత వారం నర్సింహ తండ్రి సాయిలు మరణించినప్పుడు వచ్చాడు. మిగిలిన సోదరులు అందరూ వచ్చి.. కలిశారు. ఆస్తి పంపకాల్లో అన్నలకు ఎక్కువ ఇస్తున్నారని.. తనకు తక్కువ ఇస్తున్నట్లు ఆరోపించాడు. దీనంతటికి తన తల్లే కారణంగా భావించిన నర్సింహ.. ఆమెను చంపుతానని అందరిముందు బెదిరించాడు. అలా వద్దని ఎంత చెప్పినా వినలేదు.

తీరా మంగళవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి గొడ్డలితో అతికిరాతంగా కన్న తల్లిని చంపాడు నర్సింహ. అనంతరం హత్నూర పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.