గాంధారి మండలం మర్లకుంట తండాలో రవావత్ మేగ్యా, చిలికి బాయ్‌లు కుటుంబ సభ్యులతో సహా నివాసముంటున్నారు. రోజులాగానే వ్యవసాయ బావి వద్ద త్రాగడానికి మంచినీటిని డబ్బాలో పట్టి ఉంచారు. ఆ నీటిని శుక్రవారం, శనివారాల్లో కుటుంబ సభ్యులంతా తాగారు. ఆదివారం.. వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తొమ్మిదేళ్ల బాలిక శ్రీనిధి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్లనే తమ ఆరోగ్యం క్షీణించిందని బాధితులు తెలిపారు.