ETV Bharat / jagte-raho

కర్ణాటక మద్యం పట్టివేత.. ముగ్గురు అరెస్టు - మడకశిర వార్తలు

కర్ణాటక మద్యాన్ని రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అనంతపురం జిల్లా మడకశిర ఎస్​ఈబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 56 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

illegal liquor seized in madakaseera
మడకశిరలో కర్ణాటక మద్యం పట్టివేత
author img

By

Published : Sep 22, 2020, 7:47 AM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ పరిధిలో.. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారన్న సమాచారంతో... మడకశిర స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్, వారి సిబ్బంది దాడులు చేశారు. మండలంలోని అగ్రంపల్లి, కల్లుమరి, గొల్లపల్లి గ్రామ క్రాస్​ల వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి 56 మద్యం సీసాలను, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి.. రిమాండ్​కు తరలించారు. ఇలాంటి చర్యలకు మళ్లీ పాల్పడితే.. ఎవరిపై అయినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

బాకీ తీర్చమన్నందుకు... అవమానంగా భావించి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.