టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీకి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. విదేశాలకు పారిపోకుండా ఇద్దరిని గుర్తించేలా విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో అప్రమత్తం చేశారు.
ఏబీసీఎల్ పత్రాలను ఫోర్జరీ చేయడమే కాక.. నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో రవి ప్రకాష్, శివాజీ నిందితులుగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని వీరిద్దరికి ఇదివరకే సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఇద్దరి నుంచి స్పందన రాలేదు. కేసు నుంచి తప్పించుకునేందుకు పారిపోతారనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఎల్ఓసీ జారీ చేశారు.
మరో కేసు నమోదు..
రవి ప్రకాష్, మూర్తి, హరి కిరణ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనూ మరో కేసు నమోదైంది. టీవీ9 కాపీరైట్స్, ట్రేడ్ మార్క్ను అక్రమంగా విక్రయించారని అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
రవి ప్రకాష్, శివాజీని గాలించేందుకు మూడు ప్రత్యేక బృందాలను సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. బెంగళూరు విజయవాడలో పోలీసులు గాలిస్తున్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి