ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలు స్వాధీనం - అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాల స్వాధీనం.. నిందితులపై కేసు నమోదు

రాష్ట్రంలోని పలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి, గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నప్పటికీ పోలీసుల కళ్లు గప్పి ఈ అక్రమ దందా కొనసాగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

police seized gutka and ganja in several districts of ap
అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాల స్వాధీనం.. నిందితులపై కేసు నమోదు
author img

By

Published : Sep 21, 2020, 10:54 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో విలువైన గుట్కా, గంజాయి, పాన్​ ప్యాకెట్లు పట్టివేశారు. ప్రకాశం జిల్లాలో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసిన అధికారులు... బెల్లం ఊటలను ధ్వంసం చేెశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

పశ్చిమగోదావరి జిల్లా తణుకు వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టణ పోలీసులు పట్టుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 78.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మాదకద్రవ్యాల చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. గంజాయిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన తణుకు పట్టణ పోలీసులను డీఎస్పీ రాజేశ్వర్ రెడ్డి అభినందించారు.

విశాఖపట్నం జిల్లాలో...

విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కల్యాణపులోవ వద్ద 414 కిలోల గంజాయిని కొత్తకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని ఎస్సై దామెదర్ నాయుడు తెలిపారు. ఇతర ప్రాంతాలకు తరలించడానికి 16 బస్తాల్లో సిద్ధంగా ఉందని వివరించారు. ఈ దాడిలో ఇద్దరు యువకులను అరెస్ట్ చేయగా..​ మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

కృష్ణా జిల్లాలో....

కృష్ణా జిల్లా నాగాయలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని వక్కపాట్లవారిపాలెం వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి బైక్​పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెల్లని సంచులతో పారిపోతుండగా.. వారిని పట్టుకున్నారు. ఆ సంచులు పరిశీలించగా... అందులో టొబాకో, 2768 ఖైనీ ప్యాకెట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె. శ్రీనివాసు తెలిపారు.

ప్రకాశం జిల్లాలో....

పుల్లలచేరువు మండలంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించిన అధికారులు.. బెల్లం ఉటను ధ్వంసం చేశారు. మండలంలోని అయ్యగానిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో సారా తయారీకి ఉపయోగించే 1800 లీటర్ల బెల్లం ఉటను ధ్వంసం చేశారు. త్రిపురంతాకం, పుల్లలచెరువు, యర్రగొండపాలెం మండలాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు చేసేవారి సమాచారం ఇవ్వాలని స్ధానికులకు అధికారులు సూచించారు.

ఇదీ చూడండి: వివేకా హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.