తెలంగాణ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసును ఛేదించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. కిడ్నాప్ కేసు నిందితులందరినీ పట్టుకున్నామని సీపీ తెలిపారు. నిందితుల వివరాలు ప్రెస్‌మీట్‌లో వెల్లడిస్తామని అంజనీకుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, ఆయన సోదరుల అపహరణ వ్యవహారంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: కిడ్నాప్ కేసు: పోలీసుల అదుపులో భూమా అఖిలప్రియ దంపతులు