హైదరాబాద్‌లో ఓ నకిలీ వైద్యుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదివింది పదో తరగతే అయినప్పటికీ... వైద్యుడిగా అవతారమెత్తాడు. ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నాడు.
పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు ఆ ఆస్పత్రిపై దాడి చేసి నకిలీ వైద్యుడితోపాటు ఆసుపత్రి యాజమాని షోహెబ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఆసీఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
ఇవీ చూడండి: