ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన థామస్ (25) ఏడు నెలల క్రితం భాగ్యనగరానికి వచ్చి సుచిత్రలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో నివాసముంటూ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి అతిగా మద్యం సేవించాడు. ఆ మత్తులో మూడంతస్తుల భవనంపై నుంచి కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో జరిగింది.
ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: