విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పాడేరు జూనియర్ కళాశాల వద్ద పోలీసలు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన ఓ వ్యాన్ చోదకులు.. వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. అందులో సుమారు 2 వేల కిలోల గంజాయిని గుర్తించారు. ఫలితంగా వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. పరారైన డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ కోటి రూపాయలపైనే ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: