తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేట నుంచి జగన్గూడా వెళ్లే దారిలో ఓ ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి స్తంభానికి ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలిక పరిస్థతి విషమంగా ఉంది.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలికను మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.