వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి ఓ వ్యక్తి కొట్టుకుపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వాగు వంతెన మీదుగా వరద ప్రవహిస్తోంది. విశ్వనాథ్‌పూర్ గ్రామానికి చెందిన జహంగీర్ (45) వరద ఉద్ధృతి గమనించకుండా వాగు దాటేందుకు ప్రయత్నించాడు.
మధ్యలోకి రాగానే.. నీటి ఉద్ధృతికి తట్టుకోలేక వాగులో పడి కొట్టుకుపోయాడు. తమ కళ్ల ముందే జహంగీర్ గల్లంతయ్యాడని, అతణ్ని కాపాడలేకపోయామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జహంగీర్ కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు.