ఖమ్మం జిల్లా మధిర సమీపంలో గల వైరా నదిలో చిక్కుకుపోయిన వ్యక్తిని మధిర సీఐ వేణుమాధవ్ స్వయంగా తానే.. నీళ్లలోకి దిగి కాపాడారు. మధిర పురపాలిక పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన రాఘవయ్య ప్రమాదవశాత్తు వైరా వరద నీటిలో చిక్కుకుపోయాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న సీఐ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి.. తానే స్వయంగా నీటిలోకి దిగి బాధితుడుని కాపాడారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వైరా నదిలో తాడు సహాయంతో ధైర్యంగా బాధితుడిని ప్రాణాలతో ఒడ్డుకు తెచ్చిన సీఐ సాహసాన్ని స్థానికులు కొనియాడారు. ఈ సహాయక చర్యల్లో సీఐతో పాటు.. మధిర పట్టణ ఎస్సై ఉదయ్ కుమార్, బ్లూకోట్ కానిస్టేబుల్ రామారావు ఉన్నారు.
ఇదీ చదవండిః నిడదవోలులో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి