ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దేవుడి ఆభరణాలు, విగ్రహాలు, హుండీలో సొమ్మును దొంగలిస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో... 23 కేసుల్లో వీళ్లు నిందితులుగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.
నిందితుల నుంచి 164 గ్రాముల బంగారు, 15 కిలోల 360 గ్రాముల వెండి ఆభరణాలు, 23 వేల 780 రూపాయల నగదు, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీటి విలువ సుమారుగా రూ. 12 లక్షల 30 వేల 780 ఉంటుందన్నారు. నిందితుల్లో ఒకరు ఎరుకలి నల్లబోతుల నాగప్ప గతంలో పలు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు వివరించారు.
ఇదీ చూడండి: