గుట్టుచప్పుడు కాకుండా ఇతరరాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆక్సిజన్ సిలిండర్లను తెలంగాణ హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో బాధితులకు ఆక్సిజన్ ఎంతో అవసరమైన సందర్భాన్ని అదునుగా చేసుకున్న కొంత మంది గుజరాత్ వాసులు.. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను నగరానికి సరఫరా చేస్తున్నారు.
నగరంలోని గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్న 33 ఏళ్ల ఒమర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 25 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అతనికి ఎవరెవరితో వ్యాపార సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: