కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. మైదకూర మండలం ఉత్సలవరం గ్రామానికి కత్తి చిన్న గుర్రప్ప- తిరుపతమ్మ దంపతులు.. వనిపెంటలో బ్యాంకు పని ముగించుకుని ద్విచక్రవాహనంపై గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్ల తిరుపతమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన చిన్న గురప్పను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: