ETV Bharat / jagte-raho

పోలీసులు కొట్టారనే మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం! - police manhandled farmer in Cherukupalem

ఓ రైతుతో జరిగిన వివాదం కారణంగా మరో రైతును పోలీసులు స్టేషన్​కు పిలిపించి కొట్టడంతో బాధిత రైతు వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం బాధితుడ్ని వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కొట్టారనే మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Oct 30, 2020, 4:58 AM IST

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం చెరుకుపాలేనికి చెందిన రైతు వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్లను వైద్య చికిత్స నిమిత్తం బంధువులు వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఫిర్యాదు తీసుకోకపోగా.. కొట్టారు

అయినవోలు పోలీసులు కొట్టారనే మనస్తాపంతోనే తన భర్త వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితుడి భార్య లక్ష్మీ ఆరోపించారు. ఓ రైతుతో ఏర్పడిన వివాదం మూలంగా తన భర్త వెంకటేశ్వర్లుని పోలీస్​స్టేషన్​కు పిలిచి ఫిర్యాదు స్వీకరించలేకపోగా.. తిరిగి కొట్టారని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి : సెంటు భూమి పేరుతో 4 వేల కోట్లు దోచుకున్నారు: కాల్వ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.