సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త దారులను ఎంచుకుంటున్నారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌నే రూపొందించి... ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేశారు. దరఖాస్తు రుసుం పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై పోర్టు యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి ప్రకటనలు చూసి మోసపొవద్దని నిరుద్యోగులను హెచ్చరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాను గుర్తించే పనిలో పడ్డారు.
ఇదీ చదవండి