ETV Bharat / jagte-raho

జాయింట్ కలెక్టర్​ను...భూములు క్రమబద్ధీకరణ చేయిస్తా!

భూముల క్రమబద్ధీకరణ చేయిస్తానని నమ్మించి మోసం చేసిన ఓ నకిలీ ఐఏఎస్‌ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విశాఖ కలెక్టరేట్​లో జేసీ-3గా పని చేస్తున్నానని చెప్పి పలువురి దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

fake-ias-arrest-by-vishaka-police
fake-ias-arrest-by-vishaka-police
author img

By

Published : Feb 14, 2020, 9:40 AM IST

Updated : Feb 14, 2020, 12:49 PM IST

విశాఖ కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్-3గా పని చేస్తున్నానని.. భూముల క్రమబద్ధీకరణ చేయిస్తానని నమ్మించి మోసం చేసిన ఓ నకిలీ ఐఏఎస్​ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎయిర్‌పోర్టు పోలీసుస్టేషన్‌లో మురళీనగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం జల్లా పాతపట్నంకు చెందిన జి.అనిల్‌కుమార్‌ విశాఖ కలెక్టరేట్‌లో జేసీ-3 అని చెప్పుకుని కలెక్టరేట్‌లో స్పందనకు భూ సంబంధిత అంశాలపై వచ్చిన బాధితులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

మధ్యవర్తిత్వంతో రంగంలోకి...
మూర్తి అనే మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని బాధితుల వద్దకు మధ్యవర్తిత్వం నడిపి వారి సమస్యలను ఐఏఎస్‌ హోదాలో పరిష్కరిస్తానని చెప్పి కొంతమొత్తం తీసుకుంటున్నట్లు విచారణలో గుర్తించారు. మురళీనగర్‌కు చెందిన బాబ్జి నుంచి ఎన్‌.ఎ.డి. కొత్తరోడ్డు సమీపంలో స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు రూ.2.50 లక్షలు తీసుకొని కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన బాబ్జి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతని వద్ద ఐఏఎస్‌ అని గుర్తింపుకార్డు ఉన్నట్లు సమాచారం. ఇతని బారిన పడిన వారు ఎంతమంది ఉన్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది.

Fake IAS Arrest by vishaka police
నకిలీ ఐఏఎస్ అరెస్ట్

ఇదీ చదవండి : రాజధానుల ప్రకటనతో స్థిరాస్తి రంగానికి ఎదురుదెబ్బ

Last Updated : Feb 14, 2020, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.