తెలంగాణలోని మహబూబాద్ జిల్లాలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన అక్కి రాంబాబు, ఆయన భార్య కృష్ణవేణి, కుమార్తె ఛైత్రిక.. ద్విచక్ర వాహనంపై... కృష్ణవేణి తల్లిగారి ఊరైన చిలుకోయలపాడు నుంచి మన్నెగూడెం బయలుదేరారు.
ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లకుండా నేరుగా మార్గమధ్యలో చెరువు సమీపంలోని తమ వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ తమ కుమార్తె ఛైత్రికను చంపి నీటి కుంటలో పడేశారు. అనంతరం దంపతులు ఇద్దరూ ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి మరో మూడేళ్ల కుమార్తె వైష్ణవి ఉంది.
ఆత్మహత్యకు ముందు రాంబాబు తన మరదలికి ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే వీరి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.