తెలంగాణలో ఓ కానిస్టేబుల్.. అనుచితంగా ప్రవర్తించాడు. హైదరాబాద్‌లోని చార్మినార్ యునానీ ఆసుపత్రి వద్ద విద్యార్థినిని తన తీరుతో క్షోభకు గురిచేశాడు. ఆయుర్వేద భవన్‌ను తరలింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టగా... విద్యార్థులను అదుపులోకి తీసుకునే క్రమంలో.. మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. యువతిని కాళ్లతో తొక్కి... చెయ్యితో గిచ్చాడు. ఈ అనూహ్య పరిణామానికి విద్యార్థిని బాధతో గట్టిగా అరిచింది. అతని ప్రవర్తనపై యునానీ వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్- రోగుల ఇక్కట్లు