వరకట్నం వేధింపులు తట్టుకోలేక మహిళ మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం లామ్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లామ్ గ్రామానికి చెందిన గోపీకి సమీప గ్రామం ఐన పాములపాడుకు చెందిన రత్నకుమారితో మూడు నెలల క్రితం వివాహమైంది.
పెళ్లి సమయంలో 50 వేలు కట్నం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 45 వేలు ఇచ్చారు. కొద్ది రోజులుగా మిగిలిన కట్నం తెమ్మని రత్న కుమ్మారిపై ఆమె భర్త గోపి ఒత్తిడి తెచ్చాడు. అత్తారింటి వేధింపులు తోడయ్యాయి. మనస్థాపం చెందిన రత్నకుమారి.. ఉరి వేసుకుని మృతి చెందింది. మృతురాలి బంధువుల పిర్యాదుతో కేసు నమోదైంది.