కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన పురుగుపాటి వరప్రసాద్ రెడ్డి కుమారుడు సాయి వెంకట కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థి. అతను ఖర్చుల నిమిత్తం శనివారం రాత్రి 2 వేల రూపాయలు అడగ్గా.. తండ్రి ఇవ్వలేదు.
మనస్థాపం చెందిన వెంకట కృష్ణారెడ్డి.. క్షణికావేశంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఘంటసాల ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు.
ఇదీ చూడండి:
విశాఖలో బాలుడి అపహరణ...గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు