కర్నూలు జిల్లా నంద్యాలలోని సలీంనగర్కు చెందిన 22 ఏళ్ల ఫరూక్... గాజులపల్లెకు చెందిన అయేషాతో 6 నెలల క్రితం వివాహం జరిగింది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి రావాలని చెప్పగా... ఆమె వారం తర్వాత వస్తానని చెప్పింది. మనస్తాపం చెందిన ఫరూక్... ఇదే అంశంపై తల్లితో గొడవ పడ్డాడు.
ఈ ఘటనలతో కలత చెందిన అతను... క్షణికావేశంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విగతజీవిగా కొడుకుని చూసిన అతను కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రెండో పట్టణ పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: