ETV Bharat / jagte-raho

మహిళపై సమీప బంధువు హత్యాయత్నం.. పరిస్థితి విషమం - Womens health was critical in Prakasham latest News

ఓ మహిళపై తన సమీప బంధువు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో చోటు చేసుకుంది. బాధిత మహిళపై కత్తితో దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న బాధిత మహిళను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

మహిళపై సమీప బంధువు హత్యాయత్నం.. పరిస్థితి విషమం

author img

By

Published : Oct 10, 2020, 7:18 AM IST

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండల పెర్నమెట్ట సమీపంలో వివాహితపై హత్యాయత్నం జరిగింది. సమీప బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం బోగిశెట్టి శివమ్మ తన వదిన అల్లుడు రమణయ్యతో ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో వాహనం పెర్నమెట్ట ఊరు చివర వద్దకు రాగానే సమీప చెరువు వైపు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తినట్లు సమాచారం. ఫలితంగా ఆగ్రహించిన రమణయ్య తన వెంట తెచ్చుకున్న కత్తితో శివమ్మపై దాడికి యత్నించగా శివమ్మ భయపడి రోడ్డు మీదకు పరుగు లంకించుకుంది.

రహదారి చేరినప్పటికీ..
కష్టం మీద రహదారికి చేరుకున్నప్పటికీ వెనకాలే వెంబండించిన రమణయ్య బాధితురాలి మెడపై కత్తితో దాడి చేశాడు. ఫలితంగా తీవ్ర రక్త స్రావంతో శివమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్​కు సమాచారం అందించారు.

రిమ్స్​కి తరలింపు..
తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న శివమ్మను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనతో నిందితుడు రమణయ్య ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చూడండి : ప్రేమ వివాహం ఎఫెక్ట్​: అంతిమ యాత్రలో ఉద్రిక్త పరిస్థితి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.