ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్లలోని ఓ కిరాణా దుకాణం క్రికెట్ బెట్టింగ్ కేంద్రంగా మారింది. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు.. బెట్టింగ్ కేంద్రంపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బూకీతో పాటు, బెట్టింగ్ ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
9 ఫోన్లు, నగదు స్వాధీనం..
అనంతరం నిందితుల నుంచి 9 సెల్ ఫోన్లు, రూ.10,000 నగదును స్వాధీనం చేసుకున్నామని రాచర్ల సబ్ ఇన్స్పెక్టర్ త్యాగరాజు తెలిపారు. ఫోన్ పే ద్వారానే బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గిద్దలూరు సీఐ సుధాకర్ రావు పేర్కొన్నారు. నిందితులందరి అకౌంట్లను సీజ్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి :