విశాఖ మన్యంలోని జెన్‌కో కేంద్రం వద్ద సీలేరు పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లును గుర్తించారు. దీని విలువ రూ. కోటి పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనంలో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారించగా... రాజస్థాన్‌కు చెందిన రవికాంత్ సేన్, మహారాష్ట్రకు చెందిన కరణ్ పరుశురాం, పర్కాలీ, పప్పు విఠల్ బరుడోగా గుర్తించారు. వీరంతా ముఠాగా ఏర్పడి మహారాష్ట్రలోని గుర్గావ్‌లోని వాహనం అద్దెకు తీసుకుని విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం ధారకొండకు వచ్చారు.
ధారకొండలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద సుమారు 480 కేజీల శీలావతి గంజాయిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. వాటిని 45 ప్యాకెట్ల రూపంలో తయారు చేసి మహారాష్ట్రకు తరలిస్తుండగా సీలేరు పోలీసులకు పట్టుబడినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. గంజాయి, వాహనాన్ని సీజ్ చేశామని, నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు.
ఇదీ చూడండి:
ఆప్కోలో అవినీతి... మాజీ ఛైర్మన్ లాకర్లో 2 కిలోల బంగారం