ETV Bharat / jagte-raho

350 కిలోల గంజాయి పట్టివేత.. డ్రైవర్ అరెస్ట్ - Police arrested cannabis accused latest News

విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి అనుమానాస్పదంగా ప్రయాణించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న క్రమంలో కాంక్రీట్ మిక్సర్ వాహనంలో గంజాయి తరలింపును పోలీసులు గుర్తించారు. ప్రస్తుత శీతాకాల సీజన్​లో అధికంగా గంజాయి అక్రమ రవాణా అవుతున్న క్రమంలో అన్ని రకాల వాహనాలకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

350 కిలోల భారీ గంజాయి పట్టివేత.. డ్రైవర్ అరెస్ట్

author img

By

Published : Nov 10, 2020, 9:58 PM IST

విశాఖ జిల్లా గొలుగొండ మండలం ఏటి గైరంపేట వద్ద కాంక్రీట్ మిక్సర్ వాహనంలో భారీగా గంజాయి పొట్లాలను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 350 కిలోల గంజాయిని గొలుగొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణకు చెందిన వ్యక్తి అరెస్ట్..
తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన డ్రైవర్​ సైదులును అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. కోటిన్నర మేర ఉంటుందని ప్రాథమిక అంచనా.

క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా..
విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి అనుమానాస్పదంగా ప్రయాణించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న క్రమంలో కాంక్రీట్ మిక్సర్ వాహనంలో గంజాయి తరలింపును పోలీసులు గుర్తించారు. ప్రస్తుత శీతాకాల సీజన్​లో అధికంగా గంజాయి అక్రమ రవాణా అవుతున్న క్రమంలో అన్ని రకాల వాహనాలకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ముమ్మర దర్యాప్తు..
పట్టుబడ్డ భారీ గంజాయి వెనక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇవీ చూడండి : టచ్ ఫోన్​కు ఆశపడ్డాడు.. కటకటాల పాలయ్యాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.