విశాఖ మన్యం నుంచి కంటైనర్ వాహనంలో తరలిస్తున్న 1058 కిలోల గంజాయిని విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం సరిహద్దుల్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ వ్యవహారం బయటపడింది.
సుమారు రూ.50 లక్షల విలువ..
పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 50 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గంజాయి రవాణాతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. పట్టుబడిన కంటైనర్ను సీజ్ చేశారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరి సహకారం ఉంది? తదితర వివరాలు ఆరా తీస్తున్నారు.