ETV Bharat / entertainment

'స్వాతంత్ర్యం ఒకరిచ్చేది కాదు.. లాక్కోవాలి'.. బోస్ మాటలతో నిఖిల్ 'స్పై' ట్రైలర్.. రానా స్పెషల్ రోల్ - నిఖిల్ కార్తికేయ 2

SPY Movie Trailer Telugu : నిఖిల్ హీరోగా నటించిన 'స్పై' సినిమా ట్రైలర్​ను గురువారం చిత్రబృందం విడుదల చేసింది. యాక్షన్​​ థ్రిల్లర్​ జోనర్​లో ఉన్న ట్రైలర్​ను మీరు చూశారా?

SPY Movie Trailer Telugu
నిఖిల్ స్పై ట్రైలర్
author img

By

Published : Jun 22, 2023, 7:16 PM IST

Updated : Jun 22, 2023, 9:36 PM IST

SPY Movie Trailer Telugu : నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనన్ జంటగా నటించిన 'స్పై' సినిమా ట్రైలర్​ను గురువారం చిత్రయూనిట్ విడుదల చేసింది. గ్యారీ బీహెచ్​ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈడీ ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై కే రాజశేఖర్​ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. సినిమాలో ఆర్యన్ రాజేశ్ ప్రాధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'స్వాతంత్య్రం అంటే ఒకరు ఇచ్చేది కాదు! లాక్కునేది, ఇది నేను చెప్పింది కాదు, నేతాజీ చెప్పింది' అంటూ రానా దగ్గుబాటి ట్రైలర్​లో మెరిశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఏంటీ కథ..
SPY Telugu Movie Story : ఫ్రీడం ఫైటర్ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? స్వాతంత్ర్యం రాక ముందు ఆయన ప్రమాదంలో మరణించారని కొందరు చెప్తుంటారు. విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని.. మరికొందరు అంటుంటారు. కానీ ఇప్పటికీ ఆయన ఎలా మరణించారన్నది మిస్టరీయే. అయితే సినిమాలో హీరో నిఖిల్ చంద్రబోస్ మరణానికి గల కారణాలను, రహస్యాలను.. చరిత్ర మిగిల్చిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే సినిమా కథ. తాజాగా రిలీజైన ట్రైలర్.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. కాగా గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన గతంలో గూఢచారి, క్షణం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు పనిచేశారు.

ఇక హీరో విషయానికొస్తే..
హీరో నిఖిల్.. కార్తికేయ - 2 సినిమాతో నార్త్​లో కూడా తన మార్కెట్​ పెంచుకున్నారు. గతేడాది ఆగస్ట్​లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. అయితే కథల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అదే ఆయన సక్సెస్​ మంత్రం అని చెప్తుంటారు. నిఖిల్ గతంలో చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, స్వామిరారా, అర్జున్ సురవరం, కేశవ ఇలా ప్రతీ సినిమాకీ ఆయన వేరియెషన్​ చూపిస్తారు. ఇక స్పై సినిమా కోసం నిఖిల్ చాలా కష్టపడ్డారట. ఇక తాజాగా విడుదలైన స్పై ట్రైలర్ చూసి నిఖిల్ ఖాతాలో మరో బ్లాక్​బస్టర్​ హిట్ పడినట్లే అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

SPY Telugu Movie Teaser : ఇదివరకే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. యూట్యూబ్​లో టీజర్​ ఇప్పటికే కోటి వ్యూస్​ దాటేసింది. కాగా సినిమాలో మకరంద్ దేశ్​పాండే, నితిన్ మెహతా, అభినవ్ కీలక పాత్రల్లో నటించారు. నిఖిల్​కు జోడిగా ఐశ్వర్య మేనన్​తో పాటు తాన్య ఠాకూర్ మెరిశారు.

Last Updated : Jun 22, 2023, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.