మద్యం మత్తులో యూట్యూబ్ ఫేం షణ్ముఖ్ జశ్వంత్.. కారు నడిపి మూడు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చేర్పించారు. జూబ్లిహిల్స్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ హుడాహైట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షణ్ముఖ్ జశ్వంత్‌ను బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా 170 రీడింగ్ చూపించింది. అతిగా మద్యం సేవించి తన మిత్రుడితో కలిసి జర్నలిస్ట్ కాలనీలో మూడు వాహనాలను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
షణ్ముఖ్ జశ్వంత్‌తో పాటు కారులో ఉన్న అతని మిత్రుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్‌సిరీస్‌తో షణ్ముఖ్ జశ్వంత్ మంచి పేరు సంపాదించిన సంగతి తెలిసిందే.
ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్..ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య