SUICIDE: నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మల్యాల రైల్వేస్టేషన్ సమీపంలో.. రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు క్రిష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన వారుగా రైల్వే పోలీసులు గుర్తించారు. అలంకొండకు చెందిన ప్రసాద్, అనిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. కానీ.. ప్రసాద్ కు.. పెద్దోడి గ్రామానికి చెందిన తన అక్క కూతురైన సురేఖతో.. 40 రోజుల క్రితం వివాహమైనట్లు బంధువులు తెలిపారు.
ప్రసాద్, అనిత ప్రేమ విషయం ఇంట్లో తెలిసే.. అతనికి వేరే పెళ్లి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పెళ్లి ఇష్టం లేక.. ప్రేమికులిద్దరూ విడిపోయి ఉండలేక.. ప్రసాద్, అనిత ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కాగా.. అనిత ఈ ఏడాదే పదో తరగతి పూర్తి చేసినట్టు గ్రామస్తులు తెలిపారు.
ఇవీ చదవండి: