ETV Bharat / crime

ఓటు వేయలేదని కక్ష గట్టిన వైకాపా కార్యకర్తలు.. పోలీస్​స్టేషన్​లో మహిళ ఫిర్యాదు

YCP ATTCK: రాష్ట్రంలో వైకాపా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికారం ఉందనే అండతో ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నారు. అడ్డొచ్చిన వారిపై భౌతికదాడులకు దిగుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా గానుగపెంటలో గడిచిన సర్పంచ్​ ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయలేదనే కారణంగా దాడికి దిగుతున్నారని ఓ మహిళ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

YCP ATTACK
YCP ATTACK
author img

By

Published : Jul 12, 2022, 10:38 AM IST

YCP ATTCK: ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో వైకాపా నాయకులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయని వారిని గుర్తించి మరీ వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తమకు అనుకూలంగా లేరు కాబట్టి ఏమైనా చేస్తామంటూ ప్రత్యక్షంగానే చెప్పి మరీ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా గానుగపెంటలో సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కారణంతో.. తమ కుటుంబాన్ని నానా రకాలుగా వేధిస్తున్నారని.. వెంకటలక్ష్మి అనే మహిళ ఆరోపిస్తున్నారు. లేనిపోని బాకీలను అంటగట్టి.. తమ నివాసాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. తమ ఇంట్లోకి తమనే వెళ్లనీయకుండా.. అడ్డంకులు సృష్టిస్తున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ కార్యాలయం చుట్టూ గత మూడు రోజులుగా తిరుగుతున్నానని.. అయినా న్యాయం జరగలేదని వాపోయారు. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. తెలుగుదేశం మద్దతుతో గెలుపొందిన తనను.. ఏ పనీ చేయకుండా అడ్డుకుంటున్నారంటూ గానుగపెంట సర్పంచ్ కూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..

గత సర్పంచ్​ ఎన్నికల్లో ఓటు వేయలేదని కక్ష గట్టిన వైకాపా కార్యకర్తలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.