ETV Bharat / crime

Boy Safe: బాలుడి కిడ్నాప్​ కేసును ఛేదించిన పోలీసులు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

boy kidnap case: ప్రకాశం జిల్లాలో కిడ్నాప్​న​కు గురైన వంశీ అనేే 9 నెలల బాలుడి కథ సుఖాంతమైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో విజయవాడలోని యువకుడి వద్ద బందీగా ఉన్న బాలుడిని పోలీసులు రక్షించారు. కిడ్నాప్​నకు గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.​

police solves a kidnap case
కిడ్నాప్​ కేసును ఛేదించిన పోలీసులు
author img

By

Published : Feb 10, 2022, 12:55 PM IST

Updated : Feb 10, 2022, 1:49 PM IST

a boy kidnap in prakasam: అపహరణకు గురైన 9నెలల బాలుడిని విజయవాడలో పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. అపహరణకు గురైన బాలుడి విషయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కూపీ లాగుతూ విచారణ చేపట్టారు. చివరకు ఆ బాలుడు విజయవాడ సమీపంలోని ఓ యువకుడి వద్ద ఉన్నాడని తెలుసుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద బందీగా ఉన్న బాలుడిని పోలీసులు రక్షించారు.

రక్షించిన బాలుడిని కనిగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ఉదయం బాలుని తల్లిదండ్రులను పిలిపించి వారికి బిడ్డను అప్పగించారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరు మహిళలతో పాటు ఒక యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కిడ్నాప్​నకు గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

అసలేం జరిగింది...

ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని కాశిరెడ్డి కాలనీకి చెందిన జయంపు గణేష్, దుర్గలకు ఇద్దరు కుమారులు. గణేష్ బేల్దారి పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాడు. భార్య దుర్గ తన ఇద్దరు పిల్లలతో కలిసి కాశిరెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది. రోజూ మాదిరిగానే దుర్గ పక్కింటి ప్రేమలత మరి కొందరు మహిళలతో కలిసి ఇంటి సమీపంలో కాలక్షేపం కోసం గుండీలాట ఆడుకునే సమయంలో దుర్గ ఒడిలోనే తన కుమారుడు వంశీ (9 నెలలు) నిద్ర పోయాడు. దీంతో పక్కింటి ప్రేమలతకు తన కుమారుడినిచ్చి తన ఇంట్లో పడుకో పెట్టమని దుర్గ కోరింది. అందుకు సరే అన్న ప్రేమలత బాలుడిని తీసుకొని దుర్గ ఇంటి వైపు వెళ్లింది.

కొంత సేపటికి వెళ్లి చూడగా..
కొద్దిసేపటి తర్వాత దుర్గ తన ఇంటికి వెళ్లి చూడగా తన కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ఆందోళన చెందింది. చుట్టుపక్కలంతా గాలించింది. చివరగా ప్రేమలతను అడగ్గా ఆమె తనకు తెలియదని, బిడ్డను ఇంట్లోనే (దుర్గ ఇంట్లో) పడుకో పెట్టానని సమాధానం ఇచ్చింది. దీంతో ఆందోళనకు గురైన దుర్గ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని అనుమానితులను, ప్రేమలతను అదుపులోకి తీసుకొని విచారణను వేగవంతం చేశారు.

ఇదీ చదవండి:12 ఏళ్ల బాలున్ని చంపిన మైనర్​.. ఎందుకో తెలిస్తే షాక్​ కావాల్సిందే!

Last Updated : Feb 10, 2022, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.