ETV Bharat / crime

పిల్లికి పాలుపోయాలంటూ... పక్కాగా ప్లాన్‌ - husband murder case latest news

భర్తను హత్య చేసింది... ఇంటి వెనుక సెప్టిక్‌ ట్యాంక్‌ కోసం తీసిన గొయ్యిలో పూడ్చేసింది. ఏం తెలియనట్లు పుట్టింటికి వెళ్లిపోయింది. పైన అద్దెకుండే వాళ్లకు అనుమానం వస్తే దొరికిపోతాను కదా.. ఏం చేయాలా అంటూ బాగా ఆలోచించింది. చివరకూ.. పిల్లికి పాలు పోయాలంటూ ప్రతిరోజు ఇంటికొచ్చేది. ఇలాంటి తరహాలో మరెన్నో విస్తుపోయే అంశాలు విచారణలో వెలుగు చూశాయి.

vanastalipuram murder case
భర్తను చంపి ఇంట్లో పూడ్చేసిన రెండో భార్య
author img

By

Published : Mar 12, 2021, 9:07 AM IST

హైదరాబాద్​ వనస్థలిపురంలో ‘భర్తను చంపి ఇంట్లో పూడ్చేసిన రెండో భార్య’ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితురాలు నౌశిన్‌ బేగం, ఆమెకు సహకరించిన మృతుడి స్నేహితుడు సునీల్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. విచారణలో విస్తుపోయే నిజాలెన్నో వెలుగుచూశాయి.

నన్నెవరో ఎత్తుకెళ్లారు.. వెంట్రుకలు కత్తిరించారంటూ..

గతేడాది జూన్‌ 2న ఆర్యసమాజ్‌లో గగన్‌ అగర్వాల్‌, నౌశిన్‌ బేగం అలియాస్‌ మర్యాద అగర్వాల్‌ పెళ్లి చేసుకున్నారు. హబ్సిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు. రెండు, మూడ్రోజులు గగన్‌ అగర్వాల్‌ పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాడు. అప్పుడు తనకు ఫోన్‌ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని, వారికి డబ్బులు ఇస్తేనే విడిచిపెడతామని బెదిరిస్తున్నారని చెప్పింది. తల వెంట్రుకల్ని కత్తిరించారంటూ ఏడ్చింది. హుటాహుటిన నగరానికి చేరుకున్న భర్త అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ను విచారించి అలాంటిదేం జరగలేదంటూ నిర్ధారించుకున్నాడు. పెళ్లయిన మూడు నెలల తర్వాత విడిపోదామంటూ భర్తకు ఓ పెద్ద మనిషితో రాయబారం పంపింది. పుట్టింటికెళ్లి ఆమెకు నచ్చజెప్పి మన్సురాబాద్‌లోని సొంతింటికి మకాం మార్చాడు. ఆమె సోదరుడు సైతం గగన్‌ అగర్వాల్‌తో టచ్‌లో ఉండేవాడని పోలీసులు గుర్తించారు.

అజ్మీర్‌ దర్గా దగ్గర ఆ ఇద్దరు

హత్య చేసిన తర్వాత పిల్లికి పాలు పోయాలంటూ నౌశిన్‌బేగం కొన్ని రోజులు మన్సురాబాద్‌లోని ఇంటికెళ్లింది. దుర్వాసన వస్తుందా అంటూ పరిశీలించుకునేది. భర్తను పాతిపెట్టిన చోట నీళ్లు పోసేది. ఇంట్లో వృథాగా పడి ఉన్న కట్టెలు, ఇతర సామగ్రిని వేసేది. పైవాళ్లు అడిగితే అబ్భే. ఇంట్లో అంతా చెత్త చెత్తగా ఉందంటూ సమాధానం చెప్పేదని రాచకొండ పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాలేదని నిర్ధారించుకున్న తర్వాత రాజస్థాన్‌లోని అజ్మీర్‌దర్గాను సందర్శించింది. అక్కడే హత్యకు సహకరించిన సునీల్‌ను కూడా కలిసింది. తన ఫోన్‌ పోయిందంటూ స్థానిక పోలీసులకు నౌశిన్‌బేగం ఫిర్యాదు చేసిందని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. గగన్‌ అగర్వాల్‌ను బెడ్‌రూంలో హత్య చేసి మృతదేహాన్ని నౌశిన్‌బేగం, సునీల్‌ ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే సునీల్‌ చేతివేళ్లకు గాయమయ్యింది. మృతుడి పేరిట రూ.కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వాటిని దక్కించుకునేందుకే సునీల్‌తో కలిసి పథకం ప్రకారమే భర్తను చంపిందా..? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. దీనికి మృతుడి కుటుంబ సభ్యులేమైనా సహకరించారా..? అంటూ కూడా కూపీ లాగుతున్నారు.

నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే..

ఇన్‌స్టాగ్రాంలో నౌశిన్‌బేగం కూతురుకు మెహిదీపట్నానికి చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అతనితో ఫోన్‌లో మాట్లాడింది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా..? అని అడిగింది. అతను కూడా అంగీకారం తెలిపాడు. అయితే.. అంతకంటే ముందు ఓ సాయం చేయాలని కోరింది. స్నేహితుడి వివాహం కోసం దిల్లీకి వెళ్తున్నానని, అక్కడి నుంచి దోహా వెళ్తానని, వచ్చేందుకు కొంత సమయం పడుతుందంటూ కొత్త నంబర్‌ నుంచి మృతుడి సోదరికి మెసేజ్‌ పంపించింది.. విమాన టిక్కెట్లను ఫోటో తీసి పెట్టిందీ ఈ యువకుడేనని పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి:

భర్తను హత్య చేసిన కేసులో మరొకరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.