Vanama Raghava judicial custody: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను.. తెలంగాణలోని కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. విచారణ అనంతరం రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో.. వనమా రాఘవను భద్రాచలం సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
Palvancha suicide case: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణను.. తాను బెదిరించినట్టు వనమా రాఘవ విచారణలో ఒప్పుకున్నాడని ఏఎస్పీ రోహిత్ తెలిపిన విషయం తెలిసిందే. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, వనమా రాఘవ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడిన ఏఎస్పీ.. వనమా రాఘవపై ఈ కేసుతోపాటు మరో 12 కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెంలోని దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవను అరెస్టు చేశాం. రాఘవతో పాటు గిరీష్, మురళిని అరెస్ట్ చేశాం. రాఘవ పరారయ్యేందుకు చావా శ్రీనివాస్, రమాకాంత్ సహకరించారు. పలు అంశాలపై రాఘవను విచారించాము. రామకృష్ణను బెదిరించినట్లు అతను ఒప్పుకున్నాడు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తాం. కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు రాఘవను హాజరుపరుస్తాం. రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయి. గతంలో నమోదైన కేసులపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం.' -రోహిత్ రాజ్, ఏఎస్పీ
సంబంధిత కథనాలు..