ఇవీ చదవండి:
ACCIDENT: కారు, బస్సు ఢీ.. ఇద్దరు మృతి! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
ACCIDENT: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. కారును.. బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన బస్సు.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ, పురుషుడు అక్కడికక్కడే మృతిచెందారు. కారు నుజ్జునుజ్జయింది. చిలమత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారు, బస్సు ఢీ... ఇద్దరు మృతి.
ఇవీ చదవండి: