ETV Bharat / crime

today crime: వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి - ఏపీలో నేటి తాజా వార్తలు

Today Crime News: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు, ఇతర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఏలూరు జిల్లాలో నాటు తుపాకీ పేలి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నంద్యాల జిల్లాలో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. మరో ఘటనలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

crime news in ap
నేటి నేర వార్తలు
author img

By

Published : Apr 6, 2022, 6:32 PM IST

Updated : Apr 6, 2022, 10:05 PM IST

Today Crime News: బాపట్ల జిల్లాలో అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కడప పాత రిమ్స్​లో పార్కింగ్ చేసిన కాలం చెల్లిన మూడు 108 వాహనాలు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయ్యాయి.

డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి: నంద్యాలలోని శ్రీనివాస్‌నగర్‌లో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రైవేట్ వసతిగృహంలో డిగ్రీ విద్యార్థి నాగరాజు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు నాగరాజు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం నందిపాడుగా పేర్కొన్నారు.

నాటు తుపాకీ పేలి... యువకుడు మృతి: ప్రమాదవశాత్తు చేతిలో ఉన్న నాటుతూపాకి పేలి ఓ గిరిజన యువకుడు మృతి చెందిన సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం తీగలపల్లి గ్రామానికి చెందిన కృష్ణ, నర్సింహారావు, రాజీవ్ కుమార్ అనే ముగ్గురు గిరిజన యువకులు కలిసి మంగళవారం రాత్రి సమీపంలోని అటవీ ప్రాంతంలో కుందేళ్ల వేటకు వెళ్లారు. రెండు నాటు తూపాకీలు వెంటతీసుకెళ్లారు.

గౌరిశంకరపురం గ్రామ శివారు మట్టిరోడ్డు లోకి రాగానే ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న రాజీవ్ కుమార్ తన ఎడమ చేతిలో ఉన్న నాటుతూపాకీని కుడి చేతిలోకి మార్చుకునే క్రమంలో అది జారీ కిందపడటంతో ఫైర్ అయినట్లు సీఐ మల్లేశ్వరావు తెలిపారు. దీంతో మధ్యలో కూర్చున్న సిదిరి కృష్ణ (28) తల వెనుకభాగంలో బుల్లెట్ పేలడంతో బలమైన గాయం కారణంగా కృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. దీనిపై కృష్ణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

వ్యక్తి అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ: గత కొద్ది రోజులుగా బాపట్ల జిల్లా అమర్తలూరు మండలంలోని మూల్పూరు గ్రామానికి చెందిన నూతక్కి రవి కిరణ్ అనే వ్యక్తి అదృశ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. అతడిని గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్​కు చెందిన వ్యక్తులు నరికి చంపారని ఎమ్మార్పీఎస్ నాయకులు తెనాలిలో రాస్తారోకో నిర్వహించారు. దీనిపై స్పందించిన పోలీసులు... నిందితులను సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు చుండూరు సీఐ కళ్యాణ్ రాజు పేర్కొన్నారు.

మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నూతక్కి రవి కిరణ్​ను దారుణంగా చంపి.. ముక్కలు చేసి మూటగట్టి తెనాలి పరిధిలోని సంగంజాగర్లమూడి కాలువలో పడేసినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. దీంతో తెనాలి రెండో పట్టణ సీఐ ఆధ్వర్యంలో ఎన్​ఆర్​ఎఫ్​ ప్రత్యేక బృందాలను ద్వారా గాలింపు చేపట్టారు. త్వరలోనే మృతదేహాన్ని వెలికి తీస్తామని వెల్లడించారు.

భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త: భార్యను గొడ్డలితో నరికి చంపిన సంఘటన నంద్యాల జిల్లా గోస్పాడు మండలం ఎం. కృష్ణాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగమ్మ అనే మహిళను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె భర్త బాల ఓబన్న గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. మెడపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బాల ఓభన్నకు మతిస్థిమితం సరిగాలేదని పోలీసులకు కుమారుడు తెలిపారు. ఓబన్న పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మూడు 108 వాహనాలు దగ్ధం: కడప పాత రిమ్స్​లో పార్కింగ్ చేసిన కాలం చెల్లిన మూడు 108 వాహనాలు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి ఆర్పకుండా పేపర్లపై వేయడంతో నిప్పు అంటుకుందని సిబ్బంది తెలిపారు. సుమారు రూ. 5లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు: గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 20 వేల నగదు , 6 సెల్​ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ప్రకాశ్ నగర్​లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. బెట్టింగ్ కోసం ప్రత్యకంగా ఓ యాప్ ఏర్పాటు చేసుకుని దాని సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని కొత్తపేట సీఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

గంజాయి పట్టివేత: విజయవాడలో 530 కిలోల గంజాయిని హనుమాన్ జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో కేసులో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.5.72 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు.

అస్వస్థత: సత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమర్రిలో గృహప్రవేశానికి వెళ్లి భోజనం చేసిన 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని మడకశిర ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హిందూపురం ఆస్పత్రికి తరలించారు.

అగ్నిప్రమాదం: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో సిలిండర్ పేలింది. కాకాని టవర్స్‌లో సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయటంతో పెను ప్రమాదం తప్పింది.

వ్యక్తి దారుణ హత్య: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు యువకుడిని చంపి మృతదేహాన్ని సమీప పొలాల్లో తగులబెట్టారు. మృతుడు దేశాయిపేట వాసి నవీన్ ప్రశాంత్‌ (21)గా గుర్తించారు. పొలం వివాదం వల్లే ప్రశాంత్‌ను చంపినట్లు అతడి తల్లి ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: Accident: రోడ్డు ప్రమాదంలో తేలప్రోలు ఎంపీపీ మృతి

Last Updated : Apr 6, 2022, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.