ETV Bharat / crime

Today Crime News: కుమారుడిని... గొడ్డలితో నరికిన తండ్రి - ఏపీ లేటెస్ట్ క్రైం అప్​డేట్స్​

Today Crime News: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు, ఇతర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. బాపట్ల జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లాలో కుమారుడిని తండ్రి గొడ్డలితో నరికి హత్య చేశాడు. గుంటూరు జిల్లాలో భార్య పదేపదే పుట్టింటికి వెళ్తుందన్న బాధతో వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

today crime news in ap
ఏపీలో నేటి నేర వార్తలు
author img

By

Published : Apr 9, 2022, 9:02 AM IST

Updated : Apr 9, 2022, 12:41 PM IST

Today Crime News: విశాఖ జిల్లాలో గుర్తుతెలియని మృతదేహం లభించింది. అనంతపురం జిల్లాలో దొంగలు దారి దోపిడీకి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద డివైడర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి.

సిగ్నల్​ తీగలు కత్తిరించి... రైలులో దోపిడీ: తిరుపతి - సికింద్రాబాద్‌ రైలులో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. అనంతపురం జిల్లా గుత్తి వద్ద సిగ్నల్‌ తీగలు కత్తిరించి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి నగలు, డబ్బు దోచుకెళ్లారు. కర్నూలు జిల్లా డోన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

కుమారుడిని గొడ్డలితో నరికిన తండ్రి: ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో దారుణం జరిగింది. నిద్రపోతున్న కుమారుడిని తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. మొదటి భార్య కుమారుడు బొల్లెద్దు కిరణ్‌(20)ను తండ్రి గాబ్రియేల్‌ హత్య చేశాడు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు.

మేడపై నుంచి జారిపడి వ్యక్తి మృతి: బాపట్ల జిల్లా కొరిసపాడు మండలంలోని మేదరమెట్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మేడపై కారిడార్​లో తిరుగుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కాళీ ప్రసాద్ మిశ్రా(43) గత కొంత కాలం నుంచి ఆర్య హోటల్​లో పని చేస్తున్నాడు. స్థానిక రామనాథం కాంప్లెక్స్​లోని ఓ గదిలో స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. గత రాత్రి మద్యం తాగి ఆ మత్తులో ప్రమాదవశాత్తు కాలుజారి భవనంపై నుంచి పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విద్యుత్​షాక్​తో వ్యక్తి మృతి: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొండాయపాలెంలో విద్యుత్​షాక్​తో వ్యక్తి మృతి చెందాడు. గోరంట్ల శేఖర్(44)అనే వ్యక్తి ఇంటి ముందు భాగంలో విద్యుత్ లైన్ సప్లై వైర్లు కలవకుండా ప్లాస్టిక్ పైపులు తొడిగారు. ప్లాస్టిక్ పైపులను అల్యూమినియం రాడ్డుతో సరి చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం: విశాఖ జిల్లా గాజువాక జింక్‌ కర్మాగారం సమీపంలో వ్యక్తి మృతదేహం లభించింది. కర్మాగారం వద్ద పొదల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు స్థానికుల సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

డివైడర్​ను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్​కు గాయాలు: కృష్ణా జిల్లా గన్నవరం వద్ద డివైడర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ రెండు భాగాలుగా విడిపోయింది. విజయవాడ వెళ్తుండగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

బాపులపాడులో చోరీకి దుండగుడి విఫలయత్నం: కృష్ణా జిల్లా బాపులపాడులో దుండగుడు చోరీకి విఫలయత్నం చేశారు. రైతుబజార్ వద్ద గుడి గంటలు, ఇతర సామగ్రి అపహరించేందుకు యత్నించగా.. స్థానికులు వెంబడించడంతో బైకు, చోరీ సొత్తు వదిలేసి దొంగ పరిపోయారు.

భార్య పుట్టించికి వెళ్తుందని... గొంతు కోసుకుని: భార్య పదేపదే పుట్టింటికి వెళ్తుందన్న బాధతో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. తెనాలికి చెందిన రామస్వామి అనే వ్యక్తికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్య ప్రతి చిన్న విషయానికి చీటికి, మాటికి అలిగి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోతుందని రామస్వామి తెలిపాడు.

మళ్లీ రామస్వామే వెళ్లి బ్రతిమలాడితే వచ్చిన భార్య.. మూడు రోజులు ఉండి మళ్లీ వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు విసుగు చెంది చనిపోవాలని నిర్ణయించుకుని.. గొంతు కోసుకుని పంట కాల్వలోకి దూకినట్టు బాధితుడు చెబుతున్నాడు. ఘటనా స్థలంలో కొందరు రామస్వామిని కాపాడి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం రామస్వామి క్షేమంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు.

రైలు ఢీకొని 60 గొర్రెలు మృతి: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలోని మహాదేవపల్లి- కొండాపురం గ్రామాల మధ్య రైలు గొర్రెల మందను ఢీకొంది. ప్రమాదంలో 60 గొర్రెలకుపైగా మృత్యువాత పడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు గొర్రెల కాపరికి రూ.3లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై హిందూపురం రైల్వే ఎస్ఐ బాలాజీ నాయక్ వివరణ కోరగా ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

కాపాడేందుకు వెళ్లి కాటికి: పుట్టపర్తి జిల్లా కదిరి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొన్న ప్రమాదంలో కుటాగుళ్లకు చెందిన గంగప్ప అనే వృద్ధుడు మృతి చెందాడు. గొర్రెలను మేతకు తీసుకెళ్లిన వృద్ధుడు రైల్వే ట్రాక్ పైకి వెళ్లిన గొర్రెలను గమనించి వాటిని కాపాడేందుకు వెళ్లాడు. అదే సమయంలో రైలు రావడంతో ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చంద్రగిరిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు: తిరుపతి జిల్లా చంద్రగిరిలో సెక్స్ రాకెట్ కలకలం రేపింది. చంద్రగిరి కోట సమీపంలో గది అద్దెకు తీసుకున్న ఓ యువకుడు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించిన పోలీసులు.. యువకుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వ్యభిచారంలోకి లాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం. గది నిండా మద్యం సీసాలు, గంజాయి ప్యాకెట్లు గుర్తించిన పోలీసులు.. సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు. గదిని సీజ్ చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్​: యువకులను లక్ష్యంగా చేసుకుని గంజాయ్ సరఫరా చేసేందుకు అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని చేబ్రోలు పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చేబ్రోలుకు చెందిన సమాధుల వెంకట్రావు, మార్కాపురం తర్లుపాడు గ్రామానికి చెందిన వీరాంజనేయులు... ఇరువురు కలసి నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసుకొని తీసుకెళ్తున్నట్లు తెనాలి డీఎస్పీ స్రవంతి తెలిపారు.

శీతల పానియాల దుకాణంలో అగ్నిప్రమాదం: కర్నూలు నగరంలోని నంద్యాల చెక్​పోస్టు వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శీతల పానియాల దుకాణంలో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాగా మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కూల్ డ్రింక్ షాపు పూర్తిగా దగ్ధమైంది.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం

Last Updated : Apr 9, 2022, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.