ETV Bharat / crime

AP CRIME: రాష్ట్రంలో పలు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి - ఏపీ నేర వార్తలు

AP CRIME: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా శెట్టూరు మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తున్న విద్యార్థులపై బైక్ దూసుకెళ్లింది.

AP CRIME NEWS
ఆంధ్రప్రదేశ్ క్రైం న్యూస్
author img

By

Published : Apr 28, 2022, 1:10 PM IST

Updated : Apr 28, 2022, 7:49 PM IST

అనంతపురం జిల్లా: శెట్టూరు మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తున్న విద్యార్థులపై బైక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బొచ్చుపల్లి అసిమ్, మాకోడికి గ్రామానికి చెందిన అరవింద్​కు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం పరీక్షలు రాసేందుకు ఎస్ఐ యువరాజు పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు.

*గుత్తి పట్టణంలో సెబ్‌ సీఐ వరలక్ష్మి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు.

*కనేకల్ మండల కేంద్రంలో చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. కనేకల్ మేజర్ గ్రామ పంచాయతీ అధికారులు కుక్కలను పట్టుకొని ఊరికి దూరంగా తరలించారని ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలంలోని పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. లక్ష్మి అనే మహిళ ఉపాధి హామీ పనులకు వెళ్లి వస్తుండగా కారు ఢీ కొనడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చంద్రగిరి సీఐ శ్రీనివాసులు వెల్లడించారు.

* వాకాడులో ఇద్దరు మహిళలు(తల్లీ, కూతురు) ఉరి వేసుకుని మృతి చెందారు. కుటుంబ సమస్యలు కారణంగా మృతి చెందారని సమాచారం.

* చంద్రగిరి మండలం అగరాల గ్రామంలోని శ్రీ అగస్తేశ్వరస్వామి, శ్రీ అరివేణి గంగమ్మ దేవాలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రెండు ఆలయాల్లో హుండీల్లోని సుమారు రూ.15వేల నగదును దోచుకెళ్లారు. ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

కృష్ణా జిల్లా: వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన ఇప్పల శ్రీనివాస రెడ్డి అనే రైతు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం, వ్యాపారంలో నష్టాలు రావడమే ఆత్మహత్యకు కారణమని బంధువులు భావిస్తున్నారు.

* సుబ్రహ్మణ్యం అనే పాత నేరస్థుడిని గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రూ.5 లక్షలు, వెండి వస్తువులు, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో పలు చోరీ కేసుల్లో సుబ్రహ్మణ్యం ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొత్తచెరువు నుంచి కదిరికి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా బస్సు టైరు పగలడంతో.. అదుపు తప్పి నీటికుంట వైపునకు దూసుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కండక్టర్​తో పాటు మరో ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపో అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

నంద్యాల జిల్లా: డోన్ పట్టణంలోని ఫ్లై ఓవర్​పై రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కొండపేటకు చెందిన జాకీరయ్య అనే యువకుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం మాధవరం పోలీసు స్టేషన్ పరిధిలోని మాలపల్లి గ్రామంలో 19వ తేదీన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన అబ్దుల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి ఎమ్మిగనూరు కోర్టు జడ్జ్ రిమాండ్ విధించడంతో ఆదోని సబ్ జైలుకు తరలించారు.

బాపట్ల జిల్లా: పాత చీరాలలో చెరువులో చేతులు శుభ్రం చేసుకునేందుకు వెళ్లి... ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు వేటపాలెం మం. దేశాయిపేటకు చెందిన అమ్మమ్మ సామ్రాజ్యం (65), మనుమడు సాయికుమార్ (25)గా పోలీసులు గుర్తించారు.

ఏలూరు జిల్లా: మండవల్లి మండలం భైరవపట్నం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో పెనుమత్స రామకృష్ణరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* లింగపాలెం మండలం యడవల్లిలో కాకాని పాస్కల్(46) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ విద్యుత్ షాక్​తో మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

కడప జిల్లా: వేంపల్లి మండలం నాగూరులో చిరుతల సంచారం సంచరిస్తోంది. పొలాల్లో రెండు చిరుతలను చూసిన రైతులు పరుగులు తీశారు. చిరుతల సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలం రాఘవాపురం కొండ గ్రావెల్ తవ్వకాల్లో జెసిబిపై మట్టిపెళ్లలు, రాళ్లు విరిగిపడ్డాయి. ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: గోనెగండ్ల పాఠశాలలో ఊడిన పెచ్చులు.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Last Updated : Apr 28, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.