ETV Bharat / crime

AP Crime News: రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాలు.. నలుగురి మృతి

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు మృతి చెెందగా. పలువురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

AP Crime News
రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాలు.. నలుగురి మృతి
author img

By

Published : Apr 10, 2022, 7:42 PM IST

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బోర్‌వెల్‌ లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కారులో మంటలు.. తప్పిన ప్రమాదం: అనంతపురం జిల్లా బెంగళూరు రోడ్డులోని శివకోటి ఆలయ సమీపంలో కారులో మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన వెంటనే కారులో ఉన్న నలుగురు కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పేశారు.

వైకాపా నేత ఇంటికి నిప్పంటించిన మహిళ అరెస్ట్: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో వైకాపా నేత వెంకట సుబ్బారెడ్డి ఇంటికి నిప్పంటించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక బృందాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి 24 గంటల్లోనే నిందితురాలిని పట్టుకున్నారు. గతంలోనూ సుబ్బారెడ్డిపై ఈ మహిళ కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిందని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి తెలిపారు.

నాటుసారా స్థావరాలపై సెబ్ దాడులు: బాపట్ల జిల్లా చీరాల రామానగర్​లో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్​ల ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై సెబ్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. దాడుల్లో 1500 లీటర్ల బెల్లం ఊట, ఎనిమిది లీటర్ల నిల్వ ఉన్న సారా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చీరాల సీఐ విజయకుమార్ తెలిపారు

కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు: బాపట్ల జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు అద్దంకి పరిసర ప్రాంతాల్లో కోడిపందాల స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు మారువేషాల్లో వెళ్లి కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన దాడుల్లో 69మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2,51,510 నగదు, 17 పందెం కోళ్లు, 32 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

వితంతు మహిళపై వాలంటీర్‌ దాడి:పల్నాడు జిల్లా నరసరావుపేటలో వితంతు మహిళపై వాలంటీర్‌ దాడి చేశాడు. పింఛన్ డబ్బులు అడిగితే వాలంటీర్ షేక్‌ అబ్దుల్లా దాడి చేశారని, అడ్డుకోబోయిన తన కుమార్తెపైనా దాడి చేసినట్లు బాధితురాలి జాన్ బీ ఆరోపించింది. వాలంటీర్​పై రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తెలిపింది.

వైయస్ఆర్ జిల్లాలో వ్యక్తి హత్య: వైయస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం దర్బార్‌పేట వద్ద వ్యక్తి హత్యకు గురైయ్యాడు. మృతుడు దర్బార్‌పేటకు చెందిన ఖాదర్ బాషా (35)గా గుర్తించారు. పెండ్లిమర్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం: గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి-గుంటపాలెం మధ్య పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లారీలో తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి: అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద ప్రమాదం జరిగింది. కర్నూలు-చిత్తూరు జాతీయరహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. లారీలో చిక్కుకున్న డ్రైవర్‌ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.

ఇదీ చదవండి: 'అప్పటి వరకూ విద్యుత్ సమస్య ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.