నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. గోళ్ళవారిపల్లి వద్ద పిల్లాపేరు వాగులో చేపల కోసం వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రమాదవశాత్తు వీరు వాగులో పడి ప్రాణాలుకోల్పోయారు. మృతులు ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కట్టకిందపల్లికి చెందిన పుప్పాల సురేంద్ర (27), ప్రసాద్ (29), మోపాడు కొండారెడ్డిపల్లికి చెందిన ద్రోణాదుల మనోహర్ (30)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి