Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దొరపల్లి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ఐచర్ వాహనం అతి వేగంతో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులు ఎల్లకృష్ణ, రామకృష్ణ.. నంద్యాల జిల్లాలోని దొరపల్లె గ్రామం వాసులుగా గుర్తించారు. సెకండ్ షో సినిమాకు వెళ్లి తిరిగి వస్తుండగా జాతీయ రహదారి దాటే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: